BANvsNZ | చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. న్యూజిలాండ్ కి షాక్


BANvsNZ | బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ లో చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ పై మొట్టమొదటి సారి విజయం సాధించింది.
ఓ టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై బాంగ్లాదేశ్ గెలవడం ఇదే తొలిసారి.
కివీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో కివీస్‌ను మట్టి కరిపించింది.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 2 టెస్టుల సిరీస్ ఆడుతోంది బంగ్లాదేశ్. ఈ క్రమంలోనే జనవరి 1 నుంచి తొలి టెస్ట్ మొదలైంది.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 328 పరుగులకు ఆలౌటైంది.
బంగ్లాదేశ్ 458 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల విజృంభణతో 169 పరుగులకే చాపచుట్టేసింది కివీస్.
రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి బాంగ్లాదేశ్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించినట్లైంది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌ను ఓడించి కొత్త ఏడాదిని అత్యద్భుతంగా మొదలుపెట్టింది.
ఇక ఈ విజయంతో బాంగ్లాదేశ్ 2 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.
ఇదిలా ఉంటే కివీస్ గడ్డపై బంగ్లాకు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం.

బంగ్లా ప్రజల దశాబ్దాల కలను ఎట్టకేలకు మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు సాధించింది.
దీంతో బంగ్లా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇక రెండో మ్యాచ్ లో కూడా గెలిచి తమ జట్టు సిరీస్ పట్టేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో బంగ్లా బౌలర్ ఇబడట హుస్సేన్ 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. BANvsNZ
#BANvsNZ #Bangladesh #NewZealand #TestWin