బోణీ కొట్టిన దక్షిణ ఆఫ్రికా.. లంకపై ఘనవిజయం..
కొలంబో: శ్రీలంక, దక్షిణాఫ్రికాల మధ్య అయిదు వన్డేల సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా ఓటమి పాలయింది. అయితే ఎట్టకేలకు రెండో వన్డేతనే సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి వన్డే అనూహ్యంగా ఓటమి పాలయినప్పటికీ నిరాశ చెందకుండా దూసుకెళ్లింది. రెండో వన్డేలో మ్యాచ్ ఫలితాలను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా తెలిపారు. దాంతో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో ఘనవిజయం దక్కించుకుంది. మొదట ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించారు. అందులో దక్షణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. ఆ తరువాత మరోసారి వర్షం రావడంతో శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లలో 265 పరుగులకు మార్చారు. కానీ శ్రీలంక 36.4 ఓవర్లకే కుప్పకూలింది. 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో విజయం దక్షిణాఫ్రికాని వరించింది.