Rohit Sharma సెంచరీ.. భార్య Ritika ఏం చేసిందో చూడండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా సెంచరీ బాది ఈ టెస్ట్ సిరీస్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు రోహిత్. దీంతో టీమిండియా కూడా పటిష్ఠ స్కోరు చేసేందుకు పునాది పడింది. అయితే రోహిత్ సెంచరీ చేయగానే గ్యాలరీలో ఉన్న అతడి భార్య రితిక శర్మ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రోహిత్‌ (Rohit) సెంచరీ చేయడంతో రితికా శర్మ ఆనందానికి అవధుల్లేవు. దీంతో గ్యాలరీ నుంచే భర్తకు ఫ్లైయింగ్ కిస్‌లు పంపింది. దీనికి సంబంధించిన ఫోటోలు కెమెరాలు క్లిక్‌మనిపించాయి. కాగా రోహిత్‌ సిక్స్‌ కొట్టి సెంచరీ చేసిన వెంటనే తన భార్య కూర్చొని ఉన్న గ్యాలరీవైపు బ్యాట్‌ను ఎత్తి చూపాడు. వెంటనే రితికా లేచి నిలబడి సంతోషంతో ఫ్లైయింగ్‌ కిస్‌ అందించింది. రోహిత్‌ సెంచరీ చేయడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఎంతో సంబరపడ్డాడు. అతడు ఎగిరి గంతేసినంత పనిచేశాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పట్టు బిగించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండడంతో ఆటగాళ్లంగా అద్భుతంగా రాణించాడు. దీంతో టీమిండియా మొత్తం 367 పరుగులు చేసి ఆల్‌అవుట్ అయింది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల లక్ష్యం ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు ఆటముగిసే సమయానికి 77 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. జట్టుకు ఓపెనర్లు హసీబ్ హమద్(43), రోరీ బర్న్స్(31) మంచి ఆరంభాన్నిచ్చారు.

Spread the love

1 thought on “Rohit Sharma సెంచరీ.. భార్య Ritika ఏం చేసిందో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *