IPL ఆడడమే టీమిండియా దుస్థితికి కారణం: కపిల్ దేవ్

IPL

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. 2012 తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్‌లో కనీసం సెమీస్ కూడా చేరకుండా వెనుదిరగడం టీమిండియాకు ఇదే తొలిసారి. అయితే ఈ దారుణ స్థితికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPl) టోర్నీనేనని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు.
‘ఆటగాళ్లు దేశం కంటే ఐపీఎల్ ఆడటానికే ప్రాధాన్యం ఇస్తుంటే.. ఏం చెప్పగలం?. వారి ఆర్థికస్థితి గురించి తెలియదు కానీ, దేశం తరఫున ఆడటాన్ని అందరూ గౌరవంగా భావించాలి. నేనైతే టీమిండియాకు ఆడేందుకే ప్రాధాన్యమిస్తాను. ఆటగాళ్ల ఆర్థికస్థితి గురించి తెలియదు కానీ, దేశం తరఫున ఆడటాన్ని అందరూ గౌరవంగా భావించాలి.
అలా అని ఐపీఎల్‌లో ఆడొద్దని చెప్పను. ఐపీఎల్ వల్లే చాలామందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ, దాన్ని ఆటగాళ్లు ఉపయోగించుకోలేపోతున్నారు. ఒకవేళ ఐపీఎల్‌కి, ప్రపంచకప్‌కి మధ్య వ్యవధి ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. బీసీసీఐ దీనిపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి’ అని కపిల్ అన్నారు.
ఐపీఎల్‌లో ఆడొద్దని చెప్పను. ఐపీఎల్ వల్లే చాలామందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ, దాన్ని ఆటగాళ్లు ఉపయోగించుకోలేపోతున్నారు. ఒకవేళ ఐపీఎల్‌కి, ప్రపంచకప్‌కి మధ్య వ్యవధి ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండి ఉండొచ్చు. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయాలని సూచించారు.
ఐపీఎల్-2021 మలి దశ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టడం సరైన పద్ధతి కాదు’ అని కపిల్ పేర్కొన్నారు.