Quarantine | క్వారంటైన్‌లో ఉంచారని.. హోటల్‌కు నిప్పుపెట్టిన యువతి!

Quarantine | ప్రస్తుతం మరో కొత్త కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి సమయంలో విదేశాల నుంచి వచ్చేవారు, కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు స్వయంగా క్వారంటైన్‌లోకి..

Spread the love
Quarantine
Quarantine

ప్రస్తుతం మరో కొత్త కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి సమయంలో విదేశాల నుంచి వచ్చేవారు, కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు. కానీ కొంతమంది మాత్రం క్వారంటైన్‌లో ఉండటానికి ఇష్టపడటం లేదు. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఘటనే దానికి ఉదాహరణ. ఒక 31 ఏళ్ల యువతి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంది. కానీ ఆమెకు అలా ఉండటం నచ్చలేదు. దీంతో ఏదో ఒకటి చేయాలని ఆలోచించి, షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Indian Origin | ఇంట్లో నిద్రిస్తుండగా దూసుకొచ్చిన బులెట్లు.. అమెరికాలో భారతీయ విద్యార్థిని మృతి

11వ అంతస్తులో తను ఉంటున్న గదిలో నిప్పుపెట్టింది. ఈ మంటలు ఆ ఫ్లోర్‌ మొత్తం వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా హాని జరగలేదని అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ క్వారంటైన్‌లో ఉన్న 160 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చిందన్నారు. ఇలా హోటల్‌లో నిప్పుపెట్టిన యువతిని అరెస్టు చేశామని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *