Accident | షాపింగ్ చేసి వస్తూ.. అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం!


అగ్రరాజ్యం అమెరికాలో ఒక తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వచ్చే నెల స్వదేశానికి తిరిగొద్దామనుకుంటున్న అతను.. కుటుంబానికి బహుమతులు కొనేందుకు వెళ్లాడు. షాపింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం (Accident) జరిగింది. అతను నడుపుతున్న కారు స్కిడ్ అయింది. దీంతో అదుపు తప్పిన ఆ వాహనం.. ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో (Accident) సదరు యువకుడు మృతి చెందాడు. మృతుడిని తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడిగా గుర్తించారు. అతని పేరు నరేంద్రుని చిరుసాయి అని తెలుస్తోంది. ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అతను.. డిసెంబరు 15న స్వదేశానికి వద్దామని అనుకున్నాడు. దీనికోసం విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇంటి దగ్గరి కుటుంబసభ్యులకు బహుమతులు కొనాలని షాపింగ్‌కు వెళ్లాడు. అతని వెంటన నల్గొండ జిల్లాకు చెందిన ఇక యువతి కూడా సాయితోపాటు అదే కారులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం (Accident)లో సదరు యువతికి గాయాలైనట్లు తెలుస్తోంది.
2 thoughts on “Accident | షాపింగ్ చేసి వస్తూ.. అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం!”