

కేర్ సెంటర్‌లో ఒక మానసిక వికలాంగురాలికి దీర్ఘకాలిక చికిత్స అందిస్తున్నారు. రోజూ సదరు పేషెంట్‌కు దుస్తులు మార్చడం నుంచి అన్నీ నర్సులే చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం ఆ పేషెంట్ దుస్తులు మారుస్తున్న ఒక నర్సుకు షాకింగ్ సీన్ కనిపించింది. ఆ పేషెంట్ శిశువుకు జన్మనివ్వడం కనిపించింది.
దుస్తులు మార్చే సమయంలో కడుపులో నొప్పిగా ఉందని ఆ పేషెంట్ చెప్పడంతో ఆ నర్సు పరిశీలించింది. తీరాచూస్తే ఆమె మరి కాసేపట్లో శిశువుకు జన్మనివ్వబోతున్నట్లు తెలిసింది. దీంతో షాకైన ఆమె.. వెంటనే ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించింది. ఈ గర్భానికి అదే ఆస్పత్రిలో పనిచేసే ఒక పురుష నర్సే కారణమని తేలింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో జరిగింది.
దీంతో అతన్ని ఉద్యోగం నుంచి సదరు కంపెనీ పీకిపారేసింది. ఈ ఘటన 2018లో వెలుగు చూసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధించింది.