

Ohio Accident | అమెరికాలోని ఒహాయోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు వాళ్లు మరణించారు. డిసెంబరు 15న స్వదేశానికి వచ్చేందుకు ప్లాన్ వేసుకున్న నరేంద్రుని చిరుసాయి (22) తన స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. షాపింగ్ చేసి తిరిగొస్తుండగా అతను నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక టిప్పర్ లారీ వచ్చి ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడిక్కడే మృతిచెందాడు. అతనితోపాటు కారులో ఉన్న మరో యువతికి తీవ్రమైన గాయాలయ్యాయి.
Accident | షాపింగ్ చేసి వస్తూ.. అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం!
స్థానిక ఆస్పత్రికి ఆమెను తరలించారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. మరో ఇద్దరు కూడా ఆ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో సాయి మాస్టర్స్ చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట అతని స్వస్థలం. వచ్చే నెల 15న స్వదేశానికి వచ్చేందుకు అతను ప్లాన్ వేసుకున్నాడు.
విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయం తెలిసిన సాయి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
1 thought on “Ohio Accident | ఒహాయో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు వాళ్లు మృతి”