

కెనడా ప్రభుత్వంలో మరో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక పదవులు దక్కాయి. ఆ దేశ ప్రధానిగా మరోసారి ఎన్నికైన జస్టిన్ ట్రూడో గవర్నమెంటును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మొత్తం 40 మంది పార్లమెంటరీ సెక్రటరీలు, ఫంక్షనరీలను నియమించారు. వారిలో కొత్తగా మరో ముగ్గురు ఇండో-కెనడియన్లకు చోటు దక్కింది.
ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మెలనీ జోలీకి పార్లమెంటరీ సెక్రటరీగా మణీందర్ సిధు నియమితులయ్యారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మేనీ ఎన్జీకి పార్లమెంటరీ కార్యదర్శిగా ఆరిఫ్ విరానీ నియమితులయ్యారు. మూడో భారత సంతతి ఎంపీ రూబీ సహోతా.. డిప్యూటీ గవర్నమెంట్ విప్‌గా సేవలందించనున్నారు