Immigrants | అమెరికా బోర్డర్‌లో ట్రంప్ హయాం నాటి దృశ్యాలు!

Immigrants

Immigrants | అగ్రరాజ్యం అమెరికా సరిహద్దుల్లో మరోసారి వలసల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో వలసదారులు క్యూ కట్టి నిలబడి ఉన్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో అమలు చేసిన సరిహద్దు విధానాలనే ఇప్పుడు మళ్లీ అమల్లోకి తీసుకురావాలని యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ నిర్ణయించారు. దీంతో మళ్లీ ఆనాటి పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి.
దీంతో వేలాది మంది వలసదారులు మెక్సికో సరిహద్దుల్లో ఉండిపోయారు. మైగ్రెంట్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్(ఎంపీపీ) పేరిట గతంలో డొనాల్డ్ ట్రంప్ ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం అమెరికాలో ఇమిగ్రేషన్ హియరింగ్స్ నిర్వహిస్తారు.
ఈ ప్రోగ్రాం ప్రస్తుతం ఒక చెక్‌పాయింట్ వద్ద ప్రారంభిస్తున్నట్లు సమాచారం. నెమ్మదిగా 7 ఎంట్రీ పాయింట్లలో ఇదే తరహా విధానాన్ని అమలుచేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. క్రమేపీ దీనిని పటిష్ఠంగా అమలు చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళుతున్నారు.
# Immigrants #Mexico #America #DonaldTrump #JoeBiden