Youth Suicide | అందరూ చూస్తుండగా రైలుకు ఎదురెళ్లి..

Youth Suicide

Youth Suicide

Youth Suicide

Youth Suicide: పట్టపగలు.. పదుల సంఖ్యలో జనాలంతా చూస్తుండగానే ఓ వ్యక్తి తన ప్రాణాలు తీసుకున్నాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ భయానక సంఘటనతో రైలు ఎక్కేందుకు ఎదురు చూస్తున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కళ్లముందే ఓ వ్యక్తి చనిపోవడంతో షాక్ తిన్నారు. ఈ ఘటన రామగుండం రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకుంది.

రైల్వేస్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్లాట్ ఫాం వద్దకు వస్తోంది. ప్రయాణికులంతా రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ యువకుడు ఉన్నట్లుండి ఫ్లాట్ ఫాం దిగి రైలుకు ఎదురుచుగా నిలబడ్డాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే రైలు అతడిని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. ఈ దారుణమైన సంఘటన ప్రయాణికులందరినీ షాక్‌కు గురిచేసింది.

మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా సంజయ్‌ సికింద్రాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్‌ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సంజయ్‌ మానసిక పరిస్థితి సరిగా లేనట్టు బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *