Virat Kohli | కోహ్లీ కోసం దారి వదిలేది ఎవరు?.. అందరి మదిలో ఇదే ప్రశ్న!

Virat Kohli | మూడో టెస్టుకు వేళైంది. సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలిచేందుకు తహతహలాడుతున్న భారత జట్టుకు తమ పోరాటపటిమ

Spread the love
Virat Kohli

Virat Kohli | మూడో టెస్టుకు వేళైంది. సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలిచేందుకు తహతహలాడుతున్న భారత జట్టుకు తమ పోరాటపటిమ చూపిన ప్రొటీస్.. రెండో టెస్టులో విజయం సాధించింది.

ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో ఇప్పటి వరకూ ఒక్క విజయం కూడా నమోదు చేయని భారత జట్టు విజయం కోసం పోరాడేందుకు సిద్ధమైంది. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన..టెస్ట్ కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులో చేరుతున్నాడు.

ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. తాను మూడో టెస్టుకు ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. అయితే కోహ్లీ కనుక జట్టులో చేరితే, రెండో టెస్టు ఆడిన వారిలో ఎవరిని తొలగించాలనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇండియా ఎ తరఫున సౌతాఫ్రికాలో రాణించి, రెండో టెస్టులో తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హనుమ విహారిని తప్పించాలనే యోచనలో ఉన్నట్లు ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా హింట్ ఇచ్చాడు.

అయితే అభిమానులు మాత్రం ఫామ్ లేక తంటాలు పడుతున్న పుజారా, రహానేల్లో ఒకరిని తొలగిస్తే మంచిదని భావిస్తున్నారు. ముఖ్యంగా రహానేను తప్పించి, కోహ్లీని తీసుకోవాలని, అంతేకానీ మంచి ఆటతీరు కనబరుస్తున్న విహారిని తీసేయొద్దని ఫ్యాన్స్ అంటున్నారు.

మరి మూడో టెస్టులో కోహ్లీ కోసం ఎవరిని తప్పిస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయకతప్పదు.

#Ajinkya Rahane# Hanuma Vihari# Ind vs SA# Virat Kohli

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *