
Axar Patel

Axar Patel | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్టార్ ఎవరంటే కచ్చితంగా అక్షర్ పటేల్ అనే చెప్పాలి. 5 వికెట్లు తీసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మొదటి వికెట్ అశ్విన్ తీసినా.. ఆ తర్వాత అక్షర్ విజృంభించాడు.
వరుసగా వికెట్లు పగగొడుతూ న్యూజిల్యాండ్ బ్యాట్స్‌మన్‌ను ఏ మాత్రం క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో మొత్తం 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతేకాకుండా కెరీర్లో అత్యంత తక్కువ మ్యాచ్‌లలో ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.
ఇదంతా ఒకెత్తయితే మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత అక్షర్ చేసిన ఓ తప్పును పట్టుకున్నాడు మాజీ ఆటగాడు వసీం జాఫర్. అక్షర్‌ను ట్రోల్ చేశాడు. అయితే ఆ తప్పు చేసింది తాను కాదని, సూర్యకుమార్ యాదవ్ చేశాడని చెప్పి తప్పించుకున్నాడు అక్షర్.

మ్యాచ్ మూడో రోజు ఆటలో అక్షర్ అదరగొట్టాడు. 62 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సీనియర్లంతా అతడి బౌలింగ్‌ను అంతా మెచ్చుకున్నారు. అయితే వసీం జాఫర్ మాత్రం మ్యాచ్ తర్వాత అశ్విన్‌కు అక్షర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ తప్పును కనిపెట్టి ట్రోల్ చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో అక్షర్.. తాను 5 వికెట్లు తీసిన బంతిని చూపించాడు. ఆ బంతిపై ‘34-6-62-5’ అంటే 34 ఓవర్లు, 6 మెయిడెన్లు, 62 పరుగులు, 5 వికెట్లు అని అర్థం. అలాగే దానిపై ఓ డేట్ వేసి ఉంది. సాధారణంగా 5 వికెట్లు తీసిన బంతిపై ఆ రోజు డేట్ వేస్తారు.
కానీ అక్షర్ చేతిలో ఉన్న బంతిపై నవంబర్ 27కు బదులు.. 2021 అక్టోబర్ 10 అని ఉంది. ఈ విషయంపైనే జాఫర్ ట్రోల్ చేశాడు. ‘ఈ రోజు అక్షర్ చేసిన ఒకే ఒక్క తప్పు ఇదే’ అంటూ ఆ బంతి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది.
జాఫర్ ట్వీట్‌పై స్పందించిన అక్షర్.. ‘అది నేను కాదు. సూర్యకుమార్ యాదవ్ చేసిన పని’ అంటూ తప్పును స్కైపై తోసేశాడు. అక్షర్ సంజాయిషీ ఇస్తూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు కూడా రకరకాలుగా రిప్లై ఇస్తున్నారు.
‘స్కై తప్పు రాసినంత మాత్రాన నువ్వు చూసుకోవద్దా అక్షర్’ అంటూ ట్వీట్ చేస్తున్నారు.