
Shreyas Iyer

Shreyas Iyer | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అయ్యర్ సూపర్.. ఐదో స్థానానికి పర్‌ఫెక్ట్’ అంటూ ఆకాశానికెత్తేశాడు. కివీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఆడుతోంది టీమిండియా.
ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా అంతంతమాత్రంగా ఆడారు. అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. రవీంద్ర జడేజాతో కలిసి క్రీజులో పాతుకుపోయాడు.
అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. 171 బంతుల్లో 105 పరుగులు చేశాడు. శ్రేయస్ సాధించిన ఈ ఫీట్‌ని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఎంతగానో మెచ్చుకున్నాడు.
‘ముంబై నుంచి మరో బ్యాటర్. నాకెంతో సంతోషంగా ఉంది. భారత్ 345 స్కోరు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. సహజమైన ఆట తీరు ప్రదర్శించాడు. తనదైన శైలిలో ఆడాడు. అరంగేట్ర టెస్టు అయినా ఏమాత్రం తడబడలేదు. దేశవాళీ టోర్నీల్లోనూ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ, టోర్నీ ఏదైనా సరే అయ్యర్ ఏకాగ్రతలో మార్పు ఉండదు. అలాగే అవకాశం వచ్చిన ప్రతిసారీ అయ్యర్ తప్పక పరుగులు సాధిస్తాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అతడు ఐదో స్థానానిని పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడు’ అంటూ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు జాఫర్.
కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మొత్తం 345 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ప్రస్తుతం కివీస్ బ్యాటింగ్ చేస్తోంది.