

IPL2022 | క్యాష్ రిచ్ క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి చైనా మొబైల్ కంపెనీ వివో గుడ్ బై చెప్పింది. అలాగే లీగ్ కొత్త స్పాన్సర్ గా దేశీయ దిగ్గజ సంస్థ టాటా ఉండబోతోంది. అయితే వివో సంస్థ 2018 నుంచి 2023 వరకు మొత్తం 6 ఏళ్ల కాలానికి స్పాన్సర్ షిప్ తీసుకుంది.
దీనికోసం రూ.440 కోట్లు చెల్లించింది. కానీ 2019లో చైనా-భారత్ మధ్య సరిహద్దు వివాదం తలెత్తడం, భారత్ లో బ్యాన్ చైనా ఉద్యమం మొదలు కావడంతో వివో 2020లో స్పాన్సర్ షిప్ వెనక్కి తీసుకుంది.
కానీ మళ్లీ 2021లో తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు మరో 2 ఏళ్లపాటు గడువు ఉన్నప్పటికీ ఆంతరంగిక కారణాలతో స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు వివో మంగళవారం ప్రకటించింది.
దీంతో టాటా సంస్థ రంగంలోకి దిగింది. స్పాన్సర్ షిప్ తీసుకునేందుకు ముందుకొచ్చింది. అయితే దీనికోసం ఒక్కో సీజన్ కి రూ.335 కోట్లు చెల్లించనుంది. దీంతో ఇప్పటివరకు వివో ఐపీఎల్ గా పిలుచుకున్న టోర్నీ ఇకపై టాటా ఐపీఎల్ గా మారనుంది.
#TATA #IPL2022 #Sponcership #Vivo