

Virat kohli | విరాట్ కోహ్లీ.. ఒకప్పటి రన్ మెషీన్. ఛేజింగ్ కింగ్. బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగితే సెంచరీలతో అదరగొట్టేవాడు. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కనీసం రెండంకెల పరుగులు చేయడానికి కూడా చెమటోడుస్తున్నాడు కోహ్లీ.
10, 20, 30 పరుగులు చేసేటప్పటికి అవుటైపోతున్నాడు. ఇక ఈ రోజు(శుక్రవారం) సౌత్‌ఆఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఏకంగా డకౌట్‌గా వెనుతిరిగాడు. 5 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు.
కోహ్లీ ఇప్పటివరకు 247 వన్డేలు ఆడాడు. ఇన్ని మ్యాచ్‌లలో కోహ్లీ 14 సార్లు డకౌట్ అయ్యాడు. ఇక గత 790 రోజుల్లో 64 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
అంటే కోహ్లీ ఫామ్‌లేమితో ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పరిస్థితి నుంచి కోహ్లీ ఎప్పుడు బయటపడతాడో చూడాలి.
#ViratKohli #Century #TeamIndia