

Virat Kohli | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్ గా దిగిపోయిన కోహ్లీ.. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన వెంటనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొంతమంది కోహ్లీ నిర్ణయం వెనుక బీసీసీఐ ఒత్తిడి ఉండొచ్చని కూడా కామెంట్స్ చేస్తున్నాడు.
టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
‘7ఏళ్లుగా నా శక్తివంచన లేకుండా జట్టును నడిపించాను. ఇన్నేళ్లు నన్ను కెప్టెన్ గా కొనసాగించినందుకు బీసీసీఐ కి ధన్యవాదాలు. నాతో కలిసి నడిచిన జట్టు సభ్యులందరికీ కూడా. మీ వల్లే నా ప్రయాణం గొప్పగా నడిచింది’ అంటూ భావోద్వేగ సందేశం పంచుకున్నాడు.
అలాగే మాజీ కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బందికి కూడా ధన్యవాదాలు చెబుతూ.. తాను ఇంత దూరం ప్రయాణించానంటే అది వారివల్లేనని పేర్కొన్నాడు.
కాగా.. 2014లో తొలిసారి టీమిండియా టెస్ట్ జట్టు పగ్గాలను అందుకున్నాడు కోహ్లీ. 7ఏళ్లపాటు జట్టును నడిపించాడు. 5 ఏళ్లపాటు ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో నెంబర్.1 గా నిలిపాడు.
ఎన్నో అద్భుతమైన విజయాలను దేశానికి అందించాడు. విదేశాలలో కూడా ఊహించని విజయాలను సాధించాడు.
ఇప్పటివరకు 60 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ.. 40 విజయాలు అందించి అత్యధిక విజయాలు అందించిన టెస్ట్ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.
ఇదిలా ఉంటే, కోహ్లీ రిటైర్మెంట్ తో టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో ఓ శకం ముగిసినట్లైంది. అలాగే ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరనే ఆలోచన మొదలైంది.
వన్డే, టీ20ల్లో కోహ్లీ నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మనే టెస్ట్ లకు కూడా కెప్టెన్ చేస్తారా..? అనేది చూడాలి.
#ViratKohli #BCCI #RohitSharma #TestSeries #Captaincy