

Cricket | క్రికెట్ చరిత్రలో ఓ బ్యాట్స్‌మన్ ఇలా అవుట్ కావడం మీరెప్పుడూ చూసుండరు. అదిరిపోయే షాట్ కొట్టినా.. అనుకోని విచిత్రమైన పరిస్థితుల్లో అవుటైపోయాడో బ్యాట్స్‌మన్. ఒక్కసారి అవుటైన తీరు చూస్తే మనం కూడా షాకైపోతాం.
యూరోపియన్ క్రికెట్ సిరీస్(ఈసీఎస్) టీ20 టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో ఓ వికెట్‌కు సంబంధించిన ఓ వీడియోను యూరోపియన్ క్రికెట్ కమిటీ తన అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో షేర్ చేసింది.
ఈ వీడియోలో.. ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతిని బ్యాట్స్‌మన్ వికెట్ల మీదుగా.. భారీ షాట్ ఆడబోయాడు. అయితే ఆ బంతి బౌండరీ వైపు వెళ్లాల్సింది పోయి.. అక్కడే ఉన్న కీపర్ హెల్మెట్‌కు తగిలి గాల్లోకి లేచింది. ఏం జరుగుతుందో బ్యాట్స్‌మన్‌కు అర్థమయ్యే లోపే ఆ బంతి నేరుగా వెళ్లి ఓ ఫీల్డర్ చేతుల్లో పడింది. దీంతో బ్యాట్స్‌మన్ పెవిలియన్ చేరాల్సివచ్చింది.
ఈ వికెట్ చూసిన తర్వాత కామెంటేటర్స్ కూడా ఇలా ఓ బ్యాట్స్‌మన్ అవుట్ కావడం ఇంతకవరకు ఎన్నడూ చూడలేదని, బహుశా క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అయ్యుండొచ్చని చెప్పుకొచ్చారు.