

Vijay Devarakonda | అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ డమ్ అందుకున్నాడు. ఆ తరువాత భారీ సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.
అయితే విజయ్ ముందుగానే ‘మజిలి’ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా చేసేందుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ లైగర్ సినిమా కారణంగా ఆలస్యం కావడంతో శివ మరో సినిమాను తెరకెక్కించాడు. అదే ‘టక్ జగదీష్’.
ఈ సినిమా అనుకున్నంత రాణించకపోవడంతో తన తదుపరి మూవీపై దృష్టి పెట్టాడు. అయితే ప్రస్తుతం విజయ్ కుటుంబ కథా చిత్రాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ‘లైగర్’ పూర్తయిన తర్వాత సుకుమార్ సినిమా చేసేందుకు విజయ్ మొగ్గు చూపుతున్నాడు.

దీంతో శివ తన సినిమాను స్టార్ హీరో వెంకటేష్‌తో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా చేసేందుకు వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు విషయాన్ని శివ నిర్వాణ అధికారికంగా చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు శివ చెప్పుకొచ్చాడు.
పరిస్థితులు కాస్త సర్దుమణిగిన వెంటనే పట్టాలెక్కించనున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా శివ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
#Venkatesh #VijayDevarakonda #ShivaNirvana #Liger