INDvsSA | కేఎల్ రాహుల్‌కు అంపైర్ వార్నింగ్


INDvsSA | టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌ఆఫ్రికా పేసర్ కగిసో రబాడా వేసిన బంతిని చివరి సెకండ్‌లో ఆడకుండా వెనక్కి వెళ్లిపోయాడు రాహుల్.
దీంతో అంపైర్ కలుగజేసుకుని.. ‘బంతిని వదిలిపెట్టాలనుకుంటే కొంచెం ముందే స్పందించు’ అని అన్నాడు. ఆ వెంటనే రాహుల్ అంపైర్‌తో పాటు రబాడాకు సారీ చెబుతున్నట్లు చేయి చూపించాడు.
అంపైర్ మాటలు స్టంపై మైక్‌లో రికార్డు కాగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా తరపున కేఎల్ రాహుల్(50) టాప్ స్కోరర్. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్(46) అత్యధిక పరుగులు చేశాడు.
వీరిద్దరి తర్వాత మయాంక్ అగర్వాల్(26), హనుమ విహారి(20) అంతంతమాత్రం స్కోర్లు చేశారు.
ఇక బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 35 పరుగులకు ఓ వికెట్ కోల్పోయింది. ఆ వికెట్‌ను పేసర్ మహ్మద్ షమి ఆ వికెట్ దక్కించుకున్నాడు.
#INDvsSA #TeamIndia #KLRahul #2ndTest #Umpire