
IPL 2022

IPL 2022 | ఇండియన్ ప్రీమియర్ లీగ్.. బీసీసీఐకి కాసులు కురిపించే ఆట. ఆటగాళ్లను కోటీశ్వరులను చేసే ఆట. ఈ ఆట ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్ల టీమిండియాకు దక్కారు.
ఇంకా ఎంతోమంది ఆటగాళ్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. అలాంటి ఈ ఆటలో కొంతమంది ఆటగాళ్లు తమదైన ముద్ర వేశారనడంలో సందేహం లేదు.
అలాంటి ఆటగాళ్లలో స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అందులోనూ భారత్ వంటి టర్నింగ్ పిచ్‌ల్లో స్పిన్నర్ల మరింతగా రాణించగలుగుతారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఫ్రాంచైజీలన్నీ రాబోయే మెగా వేలంలో నాణ్యమైన స్పిన్నర్ల కోసం పోటీ పడే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లో అలాంటి నాణ్యమైన స్పిన్నర్ల గురించి మాట్లాడుకుంటే వినిపించే పేర్లు, నరైన్, రషీద్ ఖాన్, యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, యువ క్రికెటర్ రవి బిష్ణోయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
వీళ్లలో నరైన్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడంతో అతడిని పక్కన పెడితే.. మిగిలిన వారిలో 2021 ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీలన్నీ ముగ్గురు లెగ్ స్పిన్నర్ల కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్లే రషీద్ ఖాన్, చాహల్, రవి బిష్ణోయ్.
రషీద్ ఖాన్:

ఐపీఎల్‌లో ప్రస్తుతం ఇతడే స్టార్ స్పిన్నర్. ఈ మాట చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతమైన ప్రదర్శనలు ఎన్నో చేశాడు. అయితే కారణం ఏమో కానీ.. రషీద్ ఖాన్‌ను హైదరాబాద్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు.
దీంతో ఇప్పుడు రషీద్ మెగా వేలంలో అడుగుపెట్టాడు. ఇతడి కోసం మిగతా జట్లన్నీ కచ్చితంగా పోటీ పడతాయి.
ముఖ్యంగా కొత్తగా ఐపీఎల్‌లో అడుగుపెట్టి లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు కచ్చితంగా ఇతడి కోసం చివరి వరకు పోరాడతాయి.
అయితే ఈ పోటీని తట్టుకుని ఇతడిని మళ్లీ ఎస్ఆర్‌హెచ్ దక్కించుకోగలదా..? అంటే అనుమానమే.
ఎస్ఆర్‌హెచ్ తనను రిటైన్ చేసుకోకపోవడంతో ఫ్రాంచైజీకి వీడ్కోలు పలుకుతూ రషీద్ తన ట్విటర్‌లో ఓ సందేశం కూడా పోస్ట్ చేశాడు.
యూజ్వేందర్ చాహల్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున చాహల్ ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. కానీ అతడిని రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు ఆ ఫ్రాంచైజీ. కేవలం విరాట్ కోహ్లీ, మహ్మాద్ సిరీజ్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది.
దీంతో ఇప్పుడు చాహల్ వేలంలోకి ప్రవేశించాడు. అతడి కోసం మిగతా ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశం ఉంది. అయితే చాహల్ ఇంతకుముందే తాను ధోనీ నాయకత్వంలో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు.
దానిని బట్టి చూస్తే చాహల్ చెన్నై జట్టుకు ఆడాలనుకుంటున్నట్లు అర్థమవుతోంది. మరి అతడి కోరిక సీఎస్‌కే తీరుస్తుందో లేదో చూడాలి. అలాగే చాహల్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఆర్సీబీ కూడా పోటీలో ఉన్నా ఆశ్చర్యపోవానక్కర్లేదు.
అంతేకాకుండా కొత్త ఫ్రాంచైజీలు కూడా చాహల్ కోసం పోటీ పడే అవకాశం లేకపోలేదు.
రవిబిష్ణోయ్:

రవి బిష్ణోయ్.. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన బిష్ణోయ్ ఆ జట్టు తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
అయితే అతడిని పంజాబ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో జనవరిలో జరగబోయే మెగా వేలంలో అతడు అందుబాటులో ఉంటాడు.
అతడి కోసం కొత్త ఫ్రాంచైజీలతో పాటు మిగతా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. పంజాబ్ కూడా అతడిని తిరిగి దక్కించుకోవాలని కచ్చితంగా ప్రయత్నిస్తుంది.
వీళ్లే కాకుండా.. మరో లెగ్ స్పిన్నర్ రాహుల్, చాహర్, బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ షకిబ్ అల్ హసన్, ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్, ఢిల్లీ పేసర్ ఎన్‌రిచ్ నోర్జే వంటి ఆటగాళ్ల కోసం కూడా కచ్చితంగా ఫ్రాంచైజీల మధ్య పోటాపోటీగా వేలం జరిగే అవకాశాలున్నాయి.
#IPL2022 #RashidKhan #RaviBishnoi #YuzvendraChahal #RCB #SRH #PBSK