టమాటా ధరలపై ఈ కామెడీ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!


Tomatoes Price | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం టమాటా రేట్లు. పలురాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాటా రేట్లు పెట్రోలును దాటేశాయి. దీంతో సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. రోజురోజుకూ టమాటా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కొన్ని చోట్ల కేజీ టమాటా ధర రూ.160 కూడా పలుకుతోంది. ఈ ప్రభావంతో మిగతా కూరగాయల ధరలు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి.

సాధారణంగా చలికాలంలో కేజీ టమాటా ధరలు రూ.20 నుంచి రూ.30 వరకూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఇది రూ.150పైగా పలుకుతోంది. ప్రపంచంలో జరిగే ప్రతి అంశంపై స్పందించే నెటిజన్లు దీన్ని వదులుతారా? టమాటా ధరల పెరుగుదలపై తమ స్టైల్‌లో సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో టమాటా ధరలపై బాగా ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ ఏంటో చూద్దామా?

