

భారతదేశం నుంచి అమెరికాకు చాలామంది (NRI) వలస వెళ్తుంటారు. డాలర్ డ్రీమ్స్‌తో బోర్డర్ దాటే వాళ్లు లక్షల్లో ఉంటారు. మరి మన దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది అమెరికా వెళ్తున్నారో తెలుసా? ఈ విషయం తెలుసుకునేందుకు తాజాగా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలో మొత్తం 43 లక్షల మంది భారతీయులు నివశిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది గుజరాత్ నుంచి వచ్చినవారే.
(Indian Origin Women | కెనడాలోని శక్తిమంతమైన మహిళల్లో.. భారత సంతతి స్త్రీలు)
ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. మూడో స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. అంటే వలసలు ఎక్కువగా ఉండే పంజాబ్, కేరళను కూడా తెలుగు ప్రజలు దాటేశారన్నమాట. మొత్తం ఎన్నారైల్లో (NRI) గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లు 14 శాతం ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 12 శాతం, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 శాతం, తెలంగాణ నుంచి 4 శాతం మంది ఉన్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే గుజరాత్‌తో సమానమైనట్టే.

ఈ లెక్కన అమెరికా ఎన్నారైల్లో (NRI) అత్యధికులు తెలుగు వాళ్లే అనడంలో తప్పేమీ లేదు. సోషల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ సర్వే 2020 ఏడాదికిగానూ చేసిన సర్వే ఫలితాలివి. అంతేకాదు, అనూహ్యంగా దేశరాజధాని ఢిల్లీ నుంచి కూడా అత్యధికంగా 9 శాతం మంది ఎన్నారైలు అమెరికాలో ఉన్నారు.
1 thought on “NRI | అమెరికాలో తెలుగు వారే టాప్.. ఎన్నారైల్లో ఎంత శాతమంటే?”