
IND vs NZ

Ind vs NZ | టీమిండియా-న్యూజిల్యాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో కీ రోల్ ఎవరిదంటే.. కచ్చితంగా గ్రీన్ పార్క్ పిచ్‌దేనని చెప్పాలి. అటు ఏకాగ్రతతో ఆడే బ్యాట్స్‌మన్‌కు సహకరిస్తూనే.. ఇటు పేసర్లకు, స్పిన్నర్లకు బాగా ఉపయోగపడింది.
ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను బయటపెట్టడానికి ఈ పిచ్ సరైన వేదికగా మారింది. మ్యాచ్ చివరి రోజు ఆఖరి సెషన్లో టీమిండియా స్పిన్నర్లకు వికెట్లు దక్కిన తీరు కానీ, కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర క్రీజులో పాతుకుపోయిన విధానం కానీ.. ఈ రెండూ కాన్పూర్ పిచ్‌లోని ప్రత్యేకతను చాటి చెప్పేవే.

ఇక ఇంతగొప్ప పిచ్ తయారు చేసినందుకు గానూ గ్రీన్ పార్క్ పిచ్ క్యూరేటర్‌కు రూ.35 వేల రూపాయలను వ్యక్తిగత బహుమానంగా అందించారు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.

ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) మీడియా ముఖ్యంగా ప్రకటించింది. ఇరు జట్లకు అద్భుతంగా ఉపయోగపడే పిచ్ తయారు చేశారని గ్రౌండ్ సిబ్బందిని ఆయన మెచ్చుకున్నట్లు కూడా యూపీసీఏ తెలిపింది.