

Sukumar | ‘రంగస్థలం’ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాడు. అయితే ప్రస్తుతం సుకుమార్ తన సినిమా విషయంలో భారీ ప్లాన్ చేస్తున్నాడట.
‘రంగస్థలం’ సినిమా తర్వాతే భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ‘పుష్ప’ సినిమా రావడంతో దాన్ని వాయిదా వేసుకున్నాడట. తన డ్రీమ్ ప్రజెక్ట్‌ను సుక్కు హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా తెరక్కించాలని చూస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.
అయితే మొదట పుష్ప సినిమా అయిన వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై కసరత్తులు స్టార్ట్ చేయాలని భావించాడట. కానీ ఇప్పుడు ‘పుష్ప2’ సీన్‌లోకి రావడంతో మరోసారి తన ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాడట.
ఇంతలో దిల్ రాజు ‘సెల్ఫిష్’ మూవీ ఆఫర్ కూడా ఇచ్చాడని, దాంతో ప్రస్తుతం సుక్కు తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో డైలమాలో ఉన్నాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని, ఆ తర్వాత తీరికగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయిపోయాడట. అందుకే మహేష్, విజయ్ దేవరకొండలతో చేసే మూవీలను కూడా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
మరి దీనిపై సుకుమార్ త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
#Sukumar #Pushpa #Selfish #Mahesh