Steve Smith | అర్థరాత్రి బెడ్ రూంలో స్మిత్ బ్యాటింగ్.. వీడియో తీసిన భార్య


Steve smith | ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్థ రాత్రి తన రూంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్2021-22 రెండో టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పటిష్ఠ స్థితిలో ఉంది.
అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొ మ్యాచ్‌లోలాగే భారీ స్కోర్లు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 473/9 పరుగులకు డిక్లేర్ చేసిన ఆసీస్.. ఇంగ్లండ్‌ను 236 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
ఆసీస్ 473 పరుగుల భారీ స్కోర్ చేయడంలో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్(93)కీలక పాత్ర పోషించాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా 290 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
మ్యాచ్‌లో ఆసీస్ పటిష్ట స్ధితిలో ఉండడంతో ఆసీస్ ఆటగాళ్లంతా రాత్రిళ్లు రూంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయితే స్టాండింగ్ కెప్టెన్ స్మిత్ మాత్రం తన రూంలో బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు.

షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీన్ని స్మిత్ భార్య డాని విల్లిస్ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోకు “స్టీవ్ స్మిత్ తన కొత్త బ్యాట్‌ని చూస్తున్నారు” అని క్యాప్షన్ పెట్టింది.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “అర్ధరాత్రి పడుకోకుండా అది ఏం పని” అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. అర్థరాత్రి రూంలో బ్యాటింగ్ చేస్తూ భార్యకు దొరికిపోయావా స్మిత్’ అంటూ కొంటెగా కామెంట్ చేస్తున్నారు ఇంకొంతమంది.
#SteveSmith #Australia #England #ENGvsAUS #Ashes2021-22