Hug each other | ఈ చిన్నారి చేసిన చిన్న పని.. మనకు పెద్ద గుణపాఠం

Hug each other

Hug each other: మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారింది. ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఈ అభివృద్ధిలో పడి మనం మానవత్వం, మంచితనం మర్చిపోతున్నాం. కొంతమంది మనతో ఉంటూనే మన వెనకే గోతులు తవ్వుతుంటారు. ఇంకొంతమంది ఎలాంటి కారణం లేకుండా శత్రుత్వం పెంచుకుంటుంటారు.
కానీ ఇలాంటి ప్రపంచంలో కూడా ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తుంటాయి కొన్ని సంఘటనలు. ముఖ్యంగా చిన్న పిల్లలు తమ నిష్కల్మషమైన మనసుతో ఎదుటివారికి ప్రేమను పంచే వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి సంఘటనే ఇది.
ఓ చిన్నారి రోడ్డుపై వెళుతున్న ఓ పేద చిన్నారికి మనస్ఫూర్తిగా కౌగలించుకుంటుండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అవతలి చిన్నారి కూడా నవ్వుతూ అతడిని కౌగలించుకున్నాడు. ధనిక, పేద, నలుపు, తెలుపు అనే తేడా చూడకుండా నవ్వుతూ ఇద్దరూ కౌగలించుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో పేద బాలుడిని కౌగలించుకున్న చిన్నారి పేరు కియాన్ష్. ఈ దృశ్యాలను అతడి తల్లి తన మొబైల్‌లో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందది. లక్షల మంది ఈ వీడియో చూశారు. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇలాంటి ఉదాహరణలే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. కియాన్ష్‌ను అతడి తల్లిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.