BBL2021 | క్యాచ్ పట్టబోయి ముఖం పగలగొట్టుకున్న ప్రేక్షకుడు

Shocking

BBL2021 | క్రికెట్ చూడడానికి సరదాగా అనిపించినా చాలా డేంజరస్. 100 మైళ్ల వేగంతో దూసుకొచ్చే బంతిని అంచనా వేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా తీవ్ర గాయాల పాలు కావలసిందే. ఇప్పటికే ఎంతోమంది ఆటగాళ్లు ఈ కారణంగానే ప్రాణాలు కోల్పోయారు.
ప్యాడ్లు, హెల్మెట్లు, గార్డ్‌లు అన్నీ పెట్టుకున్నా.. వారి మరణాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. తాజాగా బిగ్ బ్యాష్ లీగ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే ప్రాణాలు ఎవరూ కోల్పోలేదు కానీ.. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం పెర్త్ స్కార్చర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హోబర్ట్ హరికేన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బ్యాట్స్‌మన్ బెన్ మెక్‌డెర్మోట్.. పెర్త్ బౌలర్ ఓవర్ ఆండ్రూ టై బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు.

ఆ బంతి నేరుగా ప్రేక్షకుల మద్యకు వెళ్లి పడింది. అయితే అక్కడే ఉన్న ఫ్యాన్.. బంతిని క్యాచ్ పట్టుకోవాలనుకున్నాడు. కానీ అది మిస్ కావడంతో బంతి నేరుగా అతడి తలకు తగిలింది. 120 మైళ్ల వేగంతో వచ్చిన బంతి తగలడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది.
క్షణాల్లో రక్తం ధారాపాతంగా కారసాగింది. దీంతో తోటి ప్రేక్షకులు ఆందోళనకు చెందారు. వెంటనే అతన్ని సర్జన్ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు స్టేడియం నిర్వాహకులు వెల్లడించారు.
కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అతడి అదృష్టం బాగుండి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కానీ క్రికెట్ బంతిని ఎలాంటి అనుభవం లేకుండా ఇలా నేరుగా పట్టుకోవాలనుకోవడం సరికాదని అనేకమంది కామెంట్లు చేస్తున్నారు.
#Cricket #ViralVideo #Shocking #BBL2021 #Australia