

Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడానికి చాలా కారణాలున్నాయని, అతడిని వెనుక చాలా కుట్రలు జరిగాయని, అతడికి వ్యతిరేకంగా చాలామంది ఉన్నారని అక్తర్ అన్నాడు. అందుకే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్నాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
‘టీ20 ప్రపంచకప్ 2021 గెలవకపోతే అది కోహ్లీకి పెద్ద సమస్య అవుతుందని నాకు తెలుసు. ఆ సమయంలో కోహ్లీ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో నేను దుబాయ్‌లోనే ఉన్నా. అందుకే నాకు అంతా తెలుసు.
కోహ్లీకి వ్యతిరేకంగా చాలామంది నిలబడ్డారు. అతడి వెనుక చాలా మంది లాబీయింగ్ చేశారు. ఫలితంగా కెప్టెన్సీ విషయంలో ఒత్తిడి పెరిగింది’ అని అక్తర్ పేర్కొన్నాడు. అలాగే కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అతడి భార్య అనుష్క కూడా ఎంతో మంచి వ్యక్తని అక్తర్ చెప్పుకొచ్చాడు.
కెప్టెన్సీ వదులుకున్నా.. రాబోయే రోజుల్లో ఆటగాడిగా మంచి ప్రదర్శనలు చేస్తే అది అతడికి ఆనందాన్నిస్తుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా స్టార్ స్టేటస్ అనుభవించాలంటే దానికి తగినట్లే సమస్యలు కూడా ఎదుర్కోవల్సి ఉంటుందని అన్నాడు.
#ViratKohli #ShoaibAktar #TeamIndia #Pakistan