Pushpa | ‘పుష్ప’లో ఆ సీన్ కట్.. సమంతతో పోల్చుతున్న ఫాన్స్

Pushpa

Pushpa | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూర్తి స్థాయి డీ గ్లామరస్ రోల్ లో నటించిన సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది.

తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమాలో బన్నీ యాక్టింగ్ కి పాజిటివ్ రెస్పాన్ వస్తోంది.

కానీ ఈ సినిమాలోని ఓ సీన్ పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తుండడంతో.. సుకుమార్ టీమ్ ఇరకాటంలో పడింది.

దీంతో ఆ సీన్ తొలగించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

సెకండ్ ఆఫ్ లో పుష్ప మారుతీ వ్యాన్ లో శ్రీవల్లి-పుష్ప కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఆ టైమ్ లో శ్రీవల్లి భుజంపై పుష్ప చేయి వేసి ఉంటాడు.

అయితే పుష్ప చేయి ఎక్కడ వేసింది కనిపించకపోయినా ఆడియెన్స్ కి మాత్రం పుష్ప చెయ్యి శ్రీవల్లి వక్షోజాలపై ఉన్నట్లు ప్రేక్షకుడికి అర్థం అవుతుంది. ఈ సీన్ చాలామందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

పుష్ప చాలా మాస్ సినిమా. ఎంత మాస్ సినిమా అయినా.. అలాంటి సీన్ పెట్టాల్సిన అవసరం లేదని విమరకుల అభిప్రాయం.

ఇది సుకుమార్ స్టయిల్ కూడా కాదని, సుక్కు సర్ ఏంటి ఇలా తీశారంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

విషయం సుకుమార్ కు కూడా చేరిందట. దీంతో సుకుమార్ నేరుగా రంగంలో దిగి.. ఆ సీన్ తొలగించేశారట.

సుకుమార్ నిర్ణయం చాలామందికి ఊరటనిచ్చినా ఇంకొంతమంది మాత్రం తప్పు బడుతున్నారు.

ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 లో చేసిన బోల్డ్ సీన్స్ తో పోల్చితే ఇది చాలా బెటర్ అని.. ఆ సినిమాపై రాని వ్యతిరేకత ఈ ఒక్క సీన్ పై ఎందుకని కామెంట్లు చేస్తున్నారు.

ఇది ఏమైనా సుకుమార్ నిర్ణయంతో ఆదివారం నుంచి ఎడిటెడ్ వెర్షన్ ప్రదర్శన కానుంది.


#Pushpa #AlluArjun #Sukumar

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *