Sara Tendulkar | ‘డేట్ నైట్’కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఎవరతను..?

Sara Tendulkar

Sara Tendulkar | టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ సీక్రెట్ డేట్‌కు వెళ్లింది.
తనతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరో చెప్పకుండా.. కేవలం అతడి చేతిని మాత్రమే చూపిస్తూ దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది సారా.
ఈ ఫోటో ఇప్పుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో అన్నీ అప్‌డేట్లు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఎవరో వ్యక్తి చేయి పట్టుకున్న సారా.. ‘డేట్ నైట్’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
‘గిల్ టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ బిజీగా ఉంటే.. సారా డేట్‌కి వెళ్లడమేంటి..?’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
అలాగే మరికొంతమంది ‘ఆ వ్యక్తి ఎవరో..?’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ అనుమానాల నేపథ్యంలో సింగర్ కనికా కపూర్ కూడా సరిగ్గా ఇలాంటి పోస్ట్‌నే షేర్ చేసింది. అలాగే సారాతో తానే డేట్‌కు వెళ్లానని చెప్పారు. దీంతో ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెడినట్లైంది.
కాగా.. సారా, కనికాలు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వెళుతుంటారు. తాజాగా కూడా అలానే వెళ్లారు. దీంతో ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉంటే టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, సారాలు ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై సారా కానీ, గిల్ కానీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఒకరి పోస్టులపై మరొకరు మాత్రం స్పందించుకుంటూ, సరదాగా సంభాషించికుంటూ ఉంటారు.
ఇక ఈ మధ్యనే గిల్.. ‘దేవతలతో ప్రేమలో పడకూడదు’ అన్న కొటేషన్ ఉన్న షర్ట్ ధరించి ఫొటో షేర్ చేశాడు. అప్పట్లో ఆ ఫోటో బాగా వైరల్ కావడంతో.. సారాకు, గిల్‌కు బ్రేకప్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో సారా చేసిన తాజా పోస్టు మరోసారి ఊహాగానాలకు తావిచ్చింది. అయితే కనికా క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు బ్రేక్ పడింది.