సమంత బాలీవుడ్‌కి మకాం మార్చేస్తుందా..?


Samantha Moving to bollywood | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ షిఫ్ట్ అవుతుందా? టాలీవుడ్ గుడ్ బై చెప్పేస్తుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. వీటన్నింటికి కారణంగా ఆదివారం జరిగిన ఐఎఫ్‌ఎఫ్ఐ ఈవెంట్‌లో సమంత మాటలే.
ప్రస్తుతం తాను బాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ మాటలే అభిమానుల్లో పలు ప్రశ్నలకు తెర లేపాయి. దానికి తడు ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్‌డీకే సమంతకు మరో ఆఫర్ ఇస్తామన్నారు కదా.. అదిగాని నిజమయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లోని ఇదే హాట్ టాపిక్‌గా ఉంది.
ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్‌డీకే సమంతకు మెయిన్ రోల్‌లో మరో వెబ్ సిరీస్ చేస్తామని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే వాళ్లు తమ నెక్స్ట సిరీస్‌కి సమంతను ఓకే చేశారని టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటనా ఇప్పటి వరకు రాలేదు. త్వరలో ఏమైనా వస్తుందేమో వేచి చూడాలి.