

మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వస్తుందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 3కి ఇంకెన్ని రోజులంటూ రోజులు లెక్కేస్తున్నారు. అయితే తాజాగా ఓ వార్త వారిని ఉలికిపాటుకు గురిచేస్తోంది.
అభిమానుల ఆశలపై ఆర్ఆర్ఆర్ నీళ్లు చల్లిందన్న వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ డిసెంబర్ 3కి లేదంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని అనుకోని కారణాల కారణంగా ఈ ట్రైలర్ రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారని, కుదిరితే ట్రైలర్ డిసెంబర్ 10 ప్రేక్షకుల ముందు రానుందని టాక్ నడుస్తోంది.
సినీ సర్కిల్స్‌లోనూ ఇదే హాట్ టాపిక్. ట్రైలర్ రిలీజ్ వాయిదాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.