Rishabh pant | ఒక్క సెంచరీతో కపిల్ దేవ్, సచిన్‌‌లను దాటేసిన పంత్

Rishabh pant | సౌతాఫ్రికాతో మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అజేయ సెంచరీతో సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్‌ల రికార్డులను..

Spread the love
Rishabh pant
Rishabh pant

Rishabh pant | సౌతాఫ్రికాతో మూడో టెస్ట్‌లో సెంచరీ కొట్టిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో ఆదుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 198 పరుగులు చేసిందంటే దానికి కారణం పంత్ అజేయ సెంచరీనే. అయితే ఈ సెంచరీతో పంత్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ల రికార్డులను కూడా బద్దలు కొట్టేశాడు.

ఈ సెంచరీతో పంత్ మొత్తం మూడు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటిది ఆఫ్రికాలో సెంచరీ కొట్టిన ఆసియాకు చెందిన తొలి వికెట్ కీపర్‌గా, మూడోది సచిన్, కపిల్‌లను దాటేసిన రికార్డ్. మూడోది SENA కంట్రీస్(సౌత్ ఆప్రికా, ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మూడింటిపై సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు.

Rishabh pant

సౌత్ ఆఫ్రికాలో 1992 నుంచి టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడుతోంది. ఇప్పటివరకు మొత్తం 23 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా పోటీపడింది. కానీ ఇన్ని మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా టీమిండియాకు చెందిన ఏ వికెట్ కీపర్ సెంచరీ కొట్టలేదు. అయితే ఆ లోటును ఇప్పుడు పంత్ తీర్చాడు. అలాగే ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాల వికెట్ కీపర్లు కూడా ఇప్పటివరకు ప్రొటీస్ గడ్డపై సెంచరీ కొట్టింది లేదు. దీంతో ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు.

అలాగే జట్టు మొత్తం కలిసి అతి తక్కువ పరుగులు చేసిన సమయంలో క్రీజులో పాతుకుపోయి సెంచరీ బాదిన టీమిండియా ఆటగాళ్లలో పంత్ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్‌లను వెనక్కి నెట్టేశాడు. 1992లో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మిగిలిన జట్టు మొత్తం 78 పరుగులు చేస్తే.. కపిల్ దేవ్ ఒక్కడే సెంచరీ బాదాడు. ఆ తర్వాత 1996లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు మొత్తం 83 పరుగులు చేస్తే సచిన్ ఒక్కటే సెంచరీ కొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌లో జట్టు మొత్తం కలిసి కేవలం 70 పరుగులే చేయగా.. పంత్ సెంచరీ చేశాడు. దీంతో ఈ లిస్ట్ లో కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టిన పంత్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

అంతేకాకుండా.. ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాల్లో సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా కూడా పంత్ రికార్డులకెక్కాడు. ఇప్పటికే ఆసీస్‌తో 2019-20ల్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ రెండు సెంచరీలు బాదేశాడు. ఇప్పుడు సఫారీలపై సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్‌పై ఇండియాలో సెంచరీ కొట్టాడు. ఇక న్యూజిల్యాండ్‌పైనే పంత్ సెంచరీ కొట్టాల్సి ఉంది. త్వరలో ఆ రికార్డ్ కూడా పంత్ సాధించేస్తాడనంలో సందేహం లేదు.

#RishabhPant #INDvsSA #KapilDev #SachinTendulkar #SENA #Century

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *