
Ravichandran Ashwin

Ravichandran Ashwin | టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్‌ను దాటేశాడు. ఇప్పటివరకు కెరీర్లో 80 టెస్టులాడిన అశ్విన్.. 418 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అశ్విన్ ఈ రికార్డు నెలకొల్పాడు. కాగా.. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓ రికార్డును, రెండో ఇన్నింగ్స్‌లో మరో రికార్డును సృష్టించాడు.
హోరాహోరీగా సాగిన టీమిండియా-న్యూజిల్యాండ్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అశ్విన్.. పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్(414 టెస్ట్ వికెట్లు)ను అధిగమించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత మాజీ సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(417 టెస్ట్ వికెట్లు) రికార్డును కూడా అధిగమించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో 4వ రోజు 3వ సెషన్‌లో విల్ యంగ్‌ను అవుట్ చేసిన (Ravichandran Ashwin) రవిచంద్రన్ అశ్విన్, 5వ రోజు హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టామ్ లాథమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
కాగా.. మొత్తంగా చూస్తే టెస్ట్ క్రికెట్లో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 టెస్టు వికెట్లతో టాప్‌లో ఉండగా, అనిల్ కుంబ్లే 619, కపిల్‌దేవ్ 434, రంగనా హెరాత్ 433 వికెట్లతో అశ్విన్ కంటే ముందున్నారు.

అయితే 80 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసి బౌలర్లలో మాత్రం అశ్విన్.. అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, హెరాత్‌లను దాటేశాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 80 టెస్టుల తర్వాత 450 వికెట్లు తీయగా.. అశ్విన్ 418 వికెట్లతో రెండో స్థానానికి చేరాడు.