RRR | ఎన్టీఆర్, చెర్రీ.. ఆర్ఆర్ఆర్ అయిపోగానే పోటీకి రెడీ?

RRR | ఇప్పటివరకు జక్కన్న సినిమా ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, చెర్రీ ఒకరితో ఒకరు పోటీకి రెడీ అవుతున్నారు. వచ్చే సంక్రాంతికి..

Spread the love
Radheshyam

RRR | ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా సినిమాల విడుదల విషయంలో క్లాషెస్ లేకుండా చూసుకుంటున్నారు. కరోనా మహమ్మారిని, ఇతర సినిమాల రిలీజ్‌లను దృష్టిలో పెట్టుకొని ప్రతి హీరో తమ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంటున్నారు.

అయితే వచ్చే సంక్రాంతి మాత్రం ఇలా ఉండదని అంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్ హీరోల సినిమాల జాతర ఉంటుందని అంటున్నారు.

Ram Charan RC15 after RRR

అందుకు కారణం ప్రతి హీరో కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి తమ కొత్త సినిమాను సిద్ధం చేయడమే అంటున్నారు. దీనిని నిజం చేసే విధంగా సోషల్ మీడియాలో వార్తలూ వస్తున్నాయి.

వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కూడా ఉన్నారని టాక్. చెర్రీ తన ఆర్‌సీ15ను వచ్చే ఏడాది సంక్రాంతికి రెడీ చేస్తున్నాడట.

NTR 30 after RRR

అదే తరహాలో ఎన్‌టీఆర్ కూడా తన 30వ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచేందుకు సిద్ధం అవుతున్నాడని టాక్ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి అంతా కూడా బడా హీరోల మధ్య పోరుతో రచ్చరచ్చ కానుందని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి వీరిలో ఎంతమంది తలపడతారో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

#Ram Charan #RC15 #NTR #NTR30 #Sankranthi

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *