

PV Sindhu | సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు విజయం సాధించింది. ఫైనల్లో 18 ఏళ్ల మాల్విక బన్సోద్‌ను రెండు సెట్లలోనే మట్టి కరిపించింది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బాబు బన్సారీ దాస్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.
ఈ మ్యాచ్‌లో యువ షట్లర్ మాల్విక బన్సోద్‌తో సింధు తలపడింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు పైచేయి సాధించింది. 21-13, 21-16 పాయింట్లతో రెండు రౌండ్లలోనే మ్యాచ్ ముగించింది. సింధు వేగాన్ని మాల్విక ఏ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక ఈ ట్రోఫీతో సింధు దాదాపు రెండేళ్ల తర్వాత ఓ టోర్నీ గెలిచినట్లయింది. సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీల్లో సింధుకు ఇది రెండో ట్రోఫీ. మొదటి సారి 2017లో జరిగిన టోర్నీలో విజయం సాధించింది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది టోర్నీ ప్రారంభంలో మాల్విక స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో సైనాను మాల్విక బన్సోద్ సునాయాసంగా ఓడించింది. కేవలం రెండు సెట్లలోనే ఓడించి రికార్డ్ సృష్టించింది. అదే దూకుడుతో టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్ చేరింది.
#SainaNehwal #PVSindhu #SyedModiIndiaInternational2022 #MalvikaBansod