Pawan Kalyan | మరో పాంటసీ స్టోరీపై పవర్ స్టార్ ఫోకస్.. ఫ్యాన్స్‌కు పండగే..


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. వరుసగా భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా పవర్ స్టార్ మరో సినిమాను ఓకే చేశాడట. ఆ సినిమాలో పవన్ తన కెరీర్ బెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రగా వచ్చిన ‘వినోదం చిత్తం’ సినిమాను తెలుగులో పవర్ స్టార్ రీమేక్ చేయనున్నాడట. ఇందులో సముద్రఖని ‘టైమ్’ అనే వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు పవన్ కూడా అదే పాత్రలో చేయనున్నాడట.
ఒకవేళ ఈ సినిమాను పవన్ ఓకే చేస్తే ఇది తన కెరీర్‌లో చేస్తున్న రెండో ఫాంటసీ సినిమా అవుతుంది. ‘గోపాల గోపాల’ సినిమాలో కృష్ణుడి పాత్ర పవన్ కెరీర్ బెస్ట్ రోల్‌గా అభిమానులు భావిస్తారు. మరి ఈ సినిమాతో మళ్లీ బెస్ట్ రోల్‌లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. త్వరలో ఏమైనా వస్తుందేమో చూడాలి. అయితే ‘వినోదం చిత్తం’ సినిమాలో పరశురామయ్యర్ అనే వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ మేనేజర్ కావాలన్నది అతడి కోరిక. కానీ ప్రమాదవశాత్తు అతడి కల నెరవేరకుండానే మరణిస్తాడు. అదే సమయంలో ‘టైమ్’ అనే వ్యక్తి పరశురామయ్యర్‌కి మూడు నెలల సమయం ఇచ్చి మళ్లీ బ్రతికిస్తాడు.
ఆ సమయంలో పరశురామయ్యర్ తన బాధ్యతలు, కలలు నెరవేర్చుకునేందుకు ఏం చేశాడు? ఆ మూడు నెలల్లో తన కల నేరవేర్చుకున్నాడా లేదా? మూడు నెలలు ఎలా గడిపాడు? అన్నది సినిమా కథ. ఇందులో ‘టైమ్’ అనే పాత్రలోనే పవర్ స్టార్ కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. నిజానిజాలు తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.
#GopalGopala #PawanKalyan #PowerStar #SamudraKhani #VinodamChittam,