Ind vs NZ | టీమిండియా-కివీస్ మ్యాచ్‌లో ‘పాకిస్తాన్ ముర్దాబాద్’

INd vs NZ

INd vs NZ

Ind vs NZ

Ind vs NZ: టీమిండియా – న్యూజిల్యాండ్ మ్యాచ్‌‌లో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మొదటి టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులంతా ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని అరవడం సంచలనం రేపింది. క్రికెట్ మైదానంలో ప్రేక్షకులు లేక చాలా కాలమైంది. దాదాపు రెండేళ్ల తరువాత భారత్‌లోని స్టేడియాల్లో మళ్లీ ప్రేక్షకుల గోల వినిపించింది కివీస్-భారత్ సిరీస్‌లతోనే. అయితే ఈ మధ్యనే టీ20 సిరీస్‌ 3-0తో గెలుచుకుంది టీమిండియా. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌కి రెడీ అయింది. తొలి టెస్ట్ ఈ రోజు నుంచే మొదలైంది.

టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో అభిమానుల్లో జోష్‌ మరింత పెరిగింది. అదే సమయంలో టీమిండియా ఇన్నింగ్స్‌ 6వ ఓవర్లో ఓపెనర్లు గిల్‌, మయాంక్‌ క్రీజులో వేగంగా ఆడుతున్నారు. అప్పుడే అభిమానులు ఒక్కసారిగా ‘పాకిస్తాన్‌ ముర్దాబాద్‌’ ముర్దాబాద్‌ పాకిస్తాన్‌” అంటూ కేకలు వేశారు.

Ind vs NZ

న్యూజిలాండ్‌ ఆటగాళ్లు పాకిస్తాన్‌ పేరు వినగానే ఆశ్చర్యానికి లోనయ్యారు. టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌ పర్యటనను భద్రత కారణాల పేరుతో న్యూజిల్యాండ్‌ ఆఖర్లో రద్దు చేసుకుంది. ఈ కారణంగా న్యూజిలాండ్‌ కూడా ఫ్యాన్స్‌ అరుపులపై ఆసక్తి చూపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *