

Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య తన బాలీవుడ్ ఎంట్రీ భారీగా ప్లాన్ చేశాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమాతో చై తన ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చై కోసం మేకర్స్ కొన్ని సన్నివేశాలను ఎక్స్‌ట్రా యాడ్ చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం చైతన్య బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యం అయ్యేలా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా బడాబడా సినిమాలే విడుదలను వాయిదా వేస్తున్నాయి.
ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా వాయిదా పడొచ్చంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ రంగంలోకి దిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.
అభిమానులంతా నిశ్చితంగా ఉండొచ్చని, ‘లాల్ సింగ్ చద్దా’ చెప్పిన టైంకి వస్తాడని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 14న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా విడుదలై తీరుతుందని మేకర్స్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో సినిమా వాయిదాపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. సినిమా చెప్పినట్లుగానే ఏప్రిల్ 14న విడుదలవుతుందని మరోసారి అధికారికంగా ప్రకటించింది.
మరి ఎంట్రీతో చై బాలీవుడ్ ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
#NagaChaitanya #Bollywood #AamirKhan #LaalSinghChadda