Mayank Agarwal | అప్పుడు సెహ్వాగ్, ఇప్పుడు మయాంక్.. 11 ఏళ్ల తర్వాత..

Mayank Agarwal

Mayank Agarwal

Mayank Agarwal

Mayank Agarwal | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చారిత్రక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన మయాంక్.. 11 ఏళ్ల నాటి సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు.

అంటే గత దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై ఒక్క భారతీయ ఓపెనర్ కూడా స్వదేశంలో టెస్టు సెంచరీ సాధంచలేదన్నమాట. అయితే ఆ కొరతను ఇప్పుడు మయాంక్ తీర్చాడు.

కివీస్‌తో శుక్రవారం జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 120 పరుగులతో నాటౌట్‌గా ఉన్న మయాంక్ ఈ రికార్డును అందుకున్నాడు.

కాగా.. మయాంక్‌కు ముందు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2010లో ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్ ఓపెనర్‌గా సెంచరీ చేశాడు.

ఆ తర్వాత టీమిండియాలో కివీస్ 2012, 2016, 2018 మూడు సార్లు పర్యటించినా.. ఒక్క భారత ఓపెనర్ కూడా సెంచరీ చేయలేదు. అయితే ఇన్నేళ్లకు మళ్లీ మయాంక్ సెంచరీ చేశాడు.

అంతేకాకుండా 2014 తర్వాత న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి ఓపెనర్‌గా కూడా మయాంక్ అగర్వాల్ రికార్డు సాధించాడు. 2014లో ఆక్లాండ్‌ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మరే ఓపెనర్ సెంచరీ చేయలేదుు.

ఇదిలా ఉంటే మయాంక్‌ అగర్వాల్ ఇప్పటివరకు టెస్ట్‌ల్లో మొత్తం 4 సెంచరీలు చేశాడు. ఇవన్నీ స్వదేశంలో చేసినవే.

#MayankAgarwal #INDvsNZ #TeamIndia #Kiwis #Century #VirenderSehwag #SikharDhawan

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *