INDvsSA | సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్‌లో అంపైర్ అరుదైన రికార్డ్

INDvsSA | సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్‌లో సౌతాఫ్రికాకే చెందిన అంపైర్ మరియాస్ ఎరాస్మర్ ఓ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 99 వన్డేలకు అంపైర్‌గా..

Spread the love
Marais Erasmus
When umpires stopped players from roughing up the ball | INDvsSA

INDvsSA | సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్‌లో సౌతాఫ్రికాకే చెందిన అంపైర్ మరియాస్ ఎరాస్మర్ ఓ అరుదైన ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు 99 వన్డేలకు అంపైర్‌గా వ్యవహరించిన ఎరాస్మస్.. ఈ మ్యాచ్‌తో తన కెరీర్లో వంద పురుషుల వన్డేలకు అంపైరింగ్ చేసిన ఎమిరేట్స్ ఐసీసీ ప్యానెల్ అంపైర్‌గా రికార్డులకెక్కాడు.

ఎరాస్మస్ కంటే ముందు దాదాపు 17 మంది ఈ రికార్డు సాధించారు. దీంతో ఈ ఘనత సాధించిన 18వ అంపైర్‌గా ఎరాస్మస్ ఐసీసీ రికార్డుల్లో తన పేరు రాసుకున్నాడు.

1988-89లో బోలాండ్ తరపున ఎరాస్మస్ తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. 1996-97 వరకు ఆడాడు. మొత్తం 53 మ్యాచ్‌లు ఆడిన ఎరాస్మస్ 1,913 రన్స్ చేశాడు. 131 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 322 రన్స్ చేసి 48 వికెట్లు తీశాడు.

అంపైర్‌గా 2006 ఫిబ్రవరిలో తొలిసారి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి పురుషుల మ్యాచ్‌లలో 100 వన్డేలతో పాటు 70 టెస్ట్ మ్యాచ్‌లు, 35 టీ20లకు అంపైరింగ్ చేశాడు. అలాగే మహిళల అంతర్జాతీయ టీ20లో 18 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశాడు.

57 ఏళ్ల ఎరాస్మస్.. 2016-17ల్లో రెండు సార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి డేవిడ్ షెపర్డ్ ట్రోఫీని అందుకున్నాడు.

ఇక ఈ లిస్ట్‌లో పాకిస్తాన్‌కి చెందిన అలీం దార్ అందరికంటే ఎక్కువగా 211 వన్డేలకు అంపైర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత సౌత్‌ఆఫ్రికాకే చెందిన ఆర్ఈ కొయిట్జర్ 209 మ్యాచ్‌లతో రెండో స్థానంలో, న్యూజిల్యాండ్‌కి చెందిన బీఈ బౌడెన్ 200 మూడో స్థానంలో ఉన్నారు.

ఈ లిస్ట్‌లో ఇండియాకు సంబంధించిన ఎస్ వెంకటరాఘవన్(52) 47వ స్థానంలో ఉన్నాడు.

#MaraisErasmus # INDvsSA #100ODi

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *