

Saina nehwal | ప్రపంచ నెంబర్ 25 సైనా నెహ్వాల్‌ని ఇండియన్ ఓపెన్ 2022లో ఓడించి రికార్డ్ సృష్టించింది 20 ఏళ్ల యువ షట్లర్ మాల్వికా బన్‌సోద్. దీంతో 2007 తర్వాత జాతీయ, అంతర్జాతీయ షటిల్ టోర్నీల్లో సైనాను ఓడించిన రెండో షట్లర్‌గా నాగ్‌పూర్‌కు చెందిన మాల్వికా రికార్డులకెక్కింది. ఇంతకుముందు కేవలం పీవీ సింధు మాత్రమే సైనాను ఓడించింది.
గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో 34 నిముషాల పాటు సైనా-మాల్వికల మధ్య పోరాటం జరిగింది. అంతేకాకుండా కేవలం 2 సెట్లలోనే సైనాను మాల్విక ఓడించడం విశేషం. మొదటి సెట్లో 17-21తో పైచేయి సాధించిన మాల్విక, రెండో సెట్లో మరింత విజృంభించి 9-21తో విజయాన్ని కైవసం చేసుకుంది.
ఇక ఈ గెలుపుపై మాల్వికా మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడూ సైనాను తన స్ఫూర్తిగా భావించానని చెప్పుకొచ్చింది.
#SainaNehwal #MalvikaBansod #IndianOpen2022