

Maharastra | సమాజంలో మహిళలపై రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. మహిళ కనిపిస్తే చాలు.. చిన్నా, పెద్దా అని లేకుండా తమ కోరిక తీర్చుకునేందకు తెగబడుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర పూణెలో దారుణం చోటుచేసుకుంది.
షిరుర్‌కు చెందిన ఓ భర్తలేని మహిళపై ఎనిమిది సార్లు అత్యాచారం జరిగింది. ఎనిమిది మంది ఎనిమిది ప్రదేశాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇన్స్‌పెక్టర్ సురేష్ కుమార్ రౌత్ చెప్పిన దాని ప్రకారం.. భర్తలేని మహిళపై కొందరు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని సమాచారం వచ్చింది. దాంతో వెంటనే మరింత సమాచారం కోసం నిర్భయ యూనిట్‌ను బాధితురాలి వద్దకు పంపాము.
ఆమెకు భర్త లేకపోవడంతో ఆమె నిస్సహాయతను పలువురు ఆసరా చేసుకొని ఆమెపై 8 సార్లు 8 చోట్ల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించలేక పోయిందని సురేష్ కుమార్ తెలిపారు.
దీనిపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్స్ 323, 376(2), 376 (డీ), 506 లతో కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
ఇప్పటి వరకు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఆయన చెప్పారు.
#Widow #Police #Pune #RapeCase #Accused #Maharastra