

Liger | బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌పై హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా ఒకప్పటిలా లేదంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. అయితే అమ్మడు ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాలో చేస్తోంది.
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాలో అనన్యకు మాస్ మసాలా హీరోయిన్ రోల్ రెడీ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన మాస్ మసాలా హీరోయిన్ రోల్ తనకు ఎంతో నచ్చిందందని, పాత్ర చాలా బాగుందంటూ కితాబిచ్చింది.
ఇదే సందర్భంగా టాలీవుడ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ హాట్ కామెంట్స్ చేసింది. తనకు ప్రాంతీయ సినిమాలంటే చాలా ఇష్టమని, కాబట్టి తెలుగులో తప్పకుండా మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పింది.
అనంతరం తెలుగు సినిమా ఒకప్పటి ప్రాంతీయ సినిమాలు కాదని, ప్రస్తుతం పాన్ ఇండియా కింగ్ అని చెప్పింది. అదే విధంగా బాలీవుడ్ ఇంకా హిందీ సినిమాలకే పరిమితం అయ్యిందని, కానీ తెలుగు మాత్రం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో సినిమాలు తెరకెక్కిస్తోందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మరి అమ్మడు మునుముందు తెలుగులో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.
Tollywood, pan india, Liger, Bollywood, Ananya,