INDvsSA | భారత అభిమానులకు షాక్.. కోహ్లీ లేకుండానే రెండో టెస్టు

INDvsSA
INDvsSA

INDvsSA | సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియాకు.. సరిగ్గా మ్యాచ్ కు ముందు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు దూరమైనట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది.

జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో రెండో టెస్ట్ జరగబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్ లో కోహ్లీ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బనే చెప్పాలి.

ఇక కోహ్లీ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతోంది. అలాగే విరాట్ కోహ్లీ స్ధానంలో హనుమ విహారీ జట్టులోకి వచ్చాడు.

#Teamindia #INDvsSA #ViratKohli

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *