INDvsSA | కేఎల్ రాహుల్ రికార్డ్.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు


INDvsSA | టీం ఇండియా యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ చారిత్ర సృష్టించాడు.
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రికార్డ్ సెంచరీ నమోదు చేసి భారత క్రికెట్ లొనే ఈ రికార్డు నెలకొల్పిన టీమిండియా తొలి ఓపెనర్ గా చరిత్రకెక్కాడు.
సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ విజృభించి ఆడాడు. అతడికి మ్యాంక్ అగర్వాల్(60:123 బంతుల్లో.. 9 ఫోర్లు) కూడా అర్థం సెంచరీతో సహకరించాడు.
ఆ తర్వాత పుజారా(0) గోల్డెన్ డక్ గా వెనుతిరిగినా.. రాహుల్ మాత్రం క్రీజులో పాటుకుపోయి సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే 218 బంతులాడిన రాహుల్ 14 ఫోర్లు, 1 సిక్స్ బాది సెంచరీ పూర్తి చేశాడు.
భారత క్రికెట్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన రెండో ఓపెనర్ గా రికార్డు సృష్టించడమే కాక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మూడు దేశాలపై ఆ దేశపు నేలపై సెంచరీ చేసిన తొలి భారతీయ ఓపెనర్ గానూ చరిత్రకెక్కాడు.

కాగా.. అంతకు ముందు మయాంక్ అగర్వాల్ తో కలిసి రాహుల్.. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
సఫారీల గడ్డపై ఇప్పటివరకు టీమిండియా 21 టెస్టులు ఆడగా.. రెండుసార్లు మాత్రమే ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.
తాజాగా కేఎల్ రాహుల్- మయాంక్ జోడి ముచ్చటగా మూడోసారి సెంచరీ భాగస్వామ్య ఫీట్ సాధించింది.