KL rahul | ‘అంకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా.. ఇంకెందుకు ఆలస్యం’

Kl rahul

Kl rahul | టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టు తరపున సూపర్ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నా.. లవ్‌లో మాత్రం క్లీన్ బౌల్డ్ అయినట్లున్నాడు.
బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టితో కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇది అఫీషియల్‌గా బయటపెట్టకపోయినా.. సోషల్ మీడియాలో వీరిద్దరి పోస్టులు, వీళ్లిద్దరూ కలిసి చేసే యాడ్స్, వీలు చిక్కినప్పుడల్లా డేటింగ్‌లకు వెళ్లడం వీటన్నింటినీ చూస్తే.. కచ్చితంగా వీళ్లిద్దరూ పీకల్తోతు ప్రేమలో ఉన్నారని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.
అయితే వారి అంచనాకు ఊతమిచ్చేలా తాజాగా ఓ సంఘటన జరిగింది. తన కూతురుతో కలిసి ఫోటోలకు ఫోజులివ్వమని స్వయంగా సునీల్ శెట్టి చెప్పి మరీ వారి ఫోటోలు తీయించారు.

సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి నటించిన చిత్రం ‘తడప్’ ప్రీమియర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో శెట్టి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఫొటోలు దిగుతుండగా.. రాహుల్‌కు ఎక్కడ నిల్చోవాలో అర్థంకాక తికమకపడ్డాడు.
ఇది గమనించి సునీల్ శెట్టి స్వయంగా రాహుల్‌ను అతియా పక్కన నిలబడమని చెప్పి వారిద్దరి ఫోటోలు తీయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. సునీల్ శెట్టి స్వయంగా తన కూతురితో ఫోటోలు దిగాలని రాహుల్‌కు చెప్పడంతో అభిమానులు సందడి చేశారు. ‘అంకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా ఇంకేంటి రాహుల్.. పద పద.. అక్కడ నిలబడు’ అంటూ కామెంట్లు చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాహుల్, అతియాలు ఎప్పుడూ, ఎక్కడా బయట ఫొటోలకు పోజులిచ్చింది లేదు.
అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం శెట్టి కుటుంబంతో కలిసి మరీ ఫోటోలకు ఫోజులివ్వడంతో వీరిద్దరి మధ్య కచ్చితంగా ప్రేమాయణం నడుస్తోందనే వార్తలకు మరింత బలం పెరిగింది.
#KLRahul #AthiyaShetty #SunielShetty #Thadap #AhaanShetty #PhotoShoot #Uncle #Dating