

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత కొన్ని రోజులుగా వీరి వివాహం నెట్టింట హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవ వధువరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
దీంతో వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా చేసుకున్నారు. ఇప్పటికే కత్రినా మెహందీ ఫంక్షన్ ఫోటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి. అయితే ఇప్పటి వరకు వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ఫోటోలను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్లు చేసి వైరల్ చేస్తున్నారు. అయితే వీరి వివాహం వీడియో, పోటో హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వివాహం విషయంలో మాత్రం కత్రినా, విక్కీ ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లు ఏర్పాట్లు చేశారని, స్పెషల్ వంటకాలతో అదరగొట్టారట. అంతేకాకుండా విక్కీని వింటేజ్ కారులో ఘనంగా ఊరేగించారు. ఈ ఫోటోలు చూస్తేనే వీరి వివాహం ఎంత అట్టహాసంగా జరిగిందో అర్థం అవుతోంది. ఈ ఫొటోల్లో కత్రిన అచ్చం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవ కన్యలా కనిపిస్తోంది.