David Warner | ‘కష్టాల్లో ఉంటే అండగా ఉంది వాళ్లే.. మర్చిపోకండి’

David Warner

David Warner | ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ లాంటి ఆటగాడిని వదులుకోవడం ఎస్‌ఆర్‌హెచ్ చేసిన పెద్ద తప్పని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీమిండియా ఆల్‌రౌండర్ ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి మద్దతుగా నిలిచాడు. జాతీయ జట్టు తరపున కష్టాల్లో ఉన్నప్పుడు వార్నర్‌కు ఎస్‌ఆర్‌హెచ్ అండగా నిలిచిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశాడు. అయితే వార్నర్ పేరు కానీ, ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచేజీ గురించి కానీ ప్రస్తావించకుండానే పఠాన్ ఈ ట్వీట్ చేశారు.

‘ఓ విదేశీ ఆటగాడిని అతడి మాజీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. కానీ ఆ ఆటగాడు పెద్ద వివాదంలో చిక్కుకుని అతడి జాతీయ జట్టు నుంచే నిషేధం ఎదుర్కొటున్న సమయంలో కూడా ఆ ఫ్రాంచైజీ అండగా నిలిచింది. అది గుర్తుంచుకోవాలి” అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీటర్ వేదికగా రాసుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్-2022 మెగా వేలం ముందు 8 ఫ్రాంఛైజీలు తాము రీటైన్ చేసుకోనే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. సన్‌రైజర్స్ కూడా కెప్టెన్ విలియమ్సన్, అబ్దుల్ సమాద్, ఉమ్రాన్ మాలిక్‌లను రీటైన్ చేసుకుంది.
అయితే ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రీటైన్ చేసుకోలేదు. ఐపీఎల్-2021 సీజన్‌లోనే డేవిడ్ వార్నర్‌ను జట్టు కెప్టెన్‌గా తొలగించింది ఫ్రాంచైజీ. అప్పటి నుంచి ఫ్రాంచైజీకి, వార్నర్‌కు మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతోందనే వార్తలున్నాయి.
ఈ క్రమంలో అభిమానులంతా వార్నర్‌కే అండగా నిలిచారు. అతడికి మద్దతుగా ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మెగా వేలం ముందు వార్నర్‌ను ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆగ్రహం రెట్టింపైంది.
#Irfanpathan #Davidwarner #SunrisersHyderabad #Aakasavani #IPL2022 #MegaAuction